కలిసి చేద్దాం! | MMRDA, Cidco to jointly develop MTHL, multi-modal corridor | Sakshi
Sakshi News home page

కలిసి చేద్దాం!

Published Sun, Jun 29 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

MMRDA, Cidco to jointly develop MTHL, multi-modal corridor

భారీ ప్రాజెక్టుల పూర్తికి ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో సంయుక్త కార్యాచరణ
ముంబై : నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ముంబై ట్రాన్స్- హార్బర్ లింక్(ఎంటీహెచ్‌ఎల్), మల్టీ మోడల్ కారి డార్ ప్రాజెక్టులను సంయుక్తంగా పూర్తిచేసేందుకు ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో నిర్ణయించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. సుమారు రూ.12,975 కోట్ల అంచనా వ్యయంతో 126 కి.మీ.ల మేర విస్తరించిన విరార్-అలీబాగ్ మల్టీ-మోడల్ కారిడార్ అభివృద్ధికి, రూ.9,630 కోట్ల అంచనావ్యయంతో 22 కి.మీ. మేర విస్తరించిన ఎంటీహెచ్‌ఎల్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రణాళికలు సిద్ధం చేసింది.  
 కాగా, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ భారీ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఎమ్మెమ్మార్డీయే తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) వైస్‌చైర్మన్, ఎండీ అయిన సం జయ్ భాటియా తెలిపారు.

ఎంటీహెచ్‌ఎల్‌లో భాగస్వాములయ్యేందుకు తమ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) నుంచి నిధుల అనుమతుల కోసం ఆ ప్రాజెక్టు ఎదురుచూస్తోందన్నారు. జేఐసీఏ నుంచి ఆ ప్రాజెక్టుకు అనుమతులు లభించడం ఆలస్యమవుతున్న దరిమిలా తాము నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చామన్నా రు. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్టు కోసం 70 శాతం నిధులను జేఐసీఏ నుంచి పొందేందుకు, మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయంతో సమకూర్చుకునేందుకు ఎమ్మెమ్మార్డీయే నిర్ణయించిందని ఆయన తెలిపారు.

అయితే జేఐ సీఏ నుంచి నిధుల అనుమతులు అందేందుకు ఏడాదికిపైగానే సమయం పట్టే అవకాశముండటంతో దాన్ని నివారించేందుకు తాము 50 శాతం వాటా నిధులను స్థానికంగానే సమకూర్చేందుకు ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సైతం భాగస్వామి కానున్నదని భాటియా తెలిపా రు. ప్రస్తుత ప్రతిపాదిత నవీముంబై ఎయిర్‌పోర్ట్ వరకు మల్టీ మోడల్ కారిడార్‌ను అనుసంధానం చేసేం దుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించా రు. దీనిపై ఎమ్మెమ్మార్డీయేతో ఇప్పటికే చర్చించామని, సంబంధిత పనులను ఆ సంస్థ ప్రారంభిస్తే తాము దానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చామన్నారు.
 
ఇదిలా ఉండగా,  ఈ రెండు భారీ ప్రాజెక్టుల కోసం ఎమ్మెమ్మార్డీయే ఒక్కొక్కదానికి రూ.25 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఇదే సమయంలో ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో సంస్థల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18వ తేదీన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెమ్మార్డీయే అదనపు మెట్రోపాలిటన్ కమిషనర్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులున్న ఈ కమిటీ పనిచేస్తుంది. ఆయా రీజియన్లలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల అమ లు, ప్రణాళిక రూపకల్పన విషయంలో ఈ రెండు సంస్థలకు సదరు కమిటీ సహాయపడుతుందని భాటియా తెలిపారు.
 
రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టేందుకు ఈ రెండు సంస్థలు ఐక్యంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు గత కొంతకాలంగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో అభివృద్ధి కుం టుపడుతోందని, ఫలితంగా ఉపాధి అవకా శాలు కూడా దెబ్బతింటున్నాయని, తాజాగా తీసు కున్న నిర్ణయంతో అభివృద్ధి పనుల వేగం పెరు గుతుం దని, ఉపాధి అకాశాలు కూడా మెరుగుపడ తాయని నగరవాసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement