ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
మోదీజీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి: కేజ్రీవాల్
Apr 21 2016 6:16 PM | Updated on Aug 15 2018 2:20 PM
న్యూఢిల్లి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనను కొట్టివేసిన విషయంలో కేజ్రీవాల్ స్పందించారు.
ఎన్నికైన ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇది మోదీ సర్కారుకు గుణపాఠంగా మారాలన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగ్రెస్ నాయకుడు హరీష్ రావత్ ను ఈ నెల 26న మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా న్యాయస్థానం సూచించింది. ఉత్తరాఖండ్ లో మార్చి 27 ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement