సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ప్రకటించిన ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇది వైద్య ఖర్చుల రీఎంబర్స్‌మెంట్ పథకం కాదని, ఆస్పత్రుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. మోదీ కేర్‌గా పిలుస్తున్న నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఎన్‌హెచ్‌పీఎస్) ద్వారా దేశ జనాభాలో 40 శాతం జనాభాకు దాదాపు పదికోట్ల కుటుంబాలకు పైగా రూ 5 లక్షల వరకూ మెడికల్ కవరేజ్ కల్పిస్తారు.
పలు రాష్ర్టాల ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పథకం వర్తిస్తుందని..ట్రస్ట్, బీమా తరహాలో ఈ పథకం పేద కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలను కల్పిస్తుందని చెప్పారు. ప్రస్తుతం మోదీ కేర్ మోడల్‌పై నీతిఆయోగ్, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయని వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఇన్సూరెన్స్ మోడల్‌లో స్కీమ్ ప్రధానంగా రూపొందితే పాలసీదారులు పెరిగేకొద్దీ ప్రీమియం తగ్గుతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు మోదీ కేర్ అమలుపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం రూ 2000 కోట్ల ప్రారంభ నిధితో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment