న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని, ఇంతకు ముందు అంచనా వేసినట్లుగా 96 శాతం కాకుండా, 100% వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.
ఎల్‌నినో ఏర్పడటానికి అవకాశాలు తగ్గినందునే మెరుగైన రుతుపవనాలకు మార్గం సుగమమైందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ అన్నారు. ఎల్‌నినో వచ్చే అవకాశాలు తక్కువేనని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం కూడా అంచనావేసిందన్నారు. రుతుపవనాలు సాధారణం కన్నా ఎక్కువ ఉండే అవకాశాలను కొట్టిపారేశారు.
రికార్డు స్థాయికి ఆహార ధాన్యాల ఉత్పత్తి:
సమృద్ధిగా కురిసిన వర్షాల కారణంగా 2016–17 పంటకాలం(జూలై–జూన్)లో రికార్డు స్థాయిలో 273.38 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు, 22.40 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని కేంద్రం అంచనా వేసింది. బియ్యం–109.15 మిలియన్ టన్నలు, గోధుమలు–97.44 మిలియన్ టన్నుల దిగుబడి సాధించొచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది.