వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని కలిశారు.
ఢిల్లీ: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెంకయ్యతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో స్థలం లేదా బంగ్లా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
విజయసాయిరెడ్డి విజ్ఞప్తి మేరకు వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఢిల్లీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంగ్లా కేటాయిస్తామని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చినట్టు సమాచారం.