మీరు నన్ను హత్య చేయాలనుకుంటున్నారా?:నితీశ్
ఈ నిర్ణయం చాలా గొప్పదని మంచి ఫలితాలు వస్తాయని ఆయన బహిరంగంగా చెప్పారు. అదే సమయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యమైన లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించారు. మరోపక్క, అటు బిజేపీ నేతలు నితీశ్ ను ఈమధ్య పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ రెండుమూడుసార్లు ట్వీట్లు చేయడంతోపాటు కొన్ని సభల్లో కూడా నితీశ్‌కు మద్దతిచ్చారు.
ఈ నేపథ్యంలోనే బిహార్‌లోని విధానసభ చాంబర్ లో ఓ ఐదుగురు జర్నలిస్టులు కూర్చుని ‘ఈ మధ్య మోదీకి బాగా దగ్గరవుతున్నారు. ఎన్డీయేకు మీరు బాహాటంగానే మద్దతిస్తున్నట్లున్నారు. పైగా బీజేపీ నేతలు కూడా మిమ్మల్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా నితీశ్ మండిపడ్డారు. ‘ ఇది నన్ను పనిగట్టుకొని రాజకీయంగా హత్య చేసే కుట్ర. దీంతో మీకు ఏమొస్తుంది. ఇది జర్నలిజం కాదు.. ఇది ఎల్లో జర్నలిజం. అదే బిహార్ కాకుండా మరో రాష్ట్రంలో అయితే అలాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టి జైలుకు పంపేవాడిని. కానీ, ప్రజాస్వామ్యవాదిని. అలాంటి పనులు నేను చేయను’ అని నితీశ్ చెప్పారు.