
న్యూఢిల్లీ: ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలంతా 5 నిమిషాల పాటు లేచి నిల్చుని దేశం కోసం ఎంతో శ్రమిస్తున్న ప్రధాని మోదీకి గౌరవం ప్రకటించాలని జరుగుతున్న ప్రచారాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. మొదట్లో ఆ ప్రచారం తనను వివాదంలోకి లాగేందుకు చేపట్టిన తప్పుడు కార్యక్రమంలా కనిపించిందని వ్యాఖ్యానించారు. ‘సదుద్దేశంతోనే ఇది ప్రారంభించారేమో. కానీ నా పైన నిజంగా అంత ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ కరోనా సంక్షోభం ముగిసేవరకు ఒక పేద కుటుంబం బాధ్యత తీసుకోండి. అంతకుమించిన గౌరవం మరొకటి ఉండదు’ అని ఆయన ట్వీట్ చేశారు.
జర్నలిస్ట్ మృతికి సంతాపం: సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మానందం కూచిభొ ట్ల మృతికి ప్రధాని సంతాపం తెలిపారు. భారతీయ సంతతికి చెందిన బ్రహ్మానందం కూచిభొట్ల కరోనాతో సోమవారం న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చనిపోయారు. ఆయన గతంలో యుఎన్‌ఐ వార్తాసంస్థ కోసం పనిచేశారు. భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు ఆయన చేసిన కృషి కలకాలం గుర్తుండిపోతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment