న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 23న వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎంలతో కోవిడ్-19 తాజా పరిస్థితుల గురించి చర్చించనున్నారు. ఈ భేటీలో ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నట్లు సమాచారం.(చదవండి: రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా!)
కాగా భారత్‌లో కోవిడ్-19 అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 93,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 53,08,015కు చేరుకుంది. అయితే అదే స్థాయిలో రికవరీ రేటు కూడా నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశంగా పరిణమించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 42,08,432 కరోనా నుంచి కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment