15వ ప్రధానిగా రేపు మోడీ ప్రమాణం! | Narendra Modi to be sworn-in tomorrow | Sakshi
Sakshi News home page

15వ ప్రధానిగా రేపు మోడీ ప్రమాణం!

Published Sun, May 25 2014 11:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

15వ ప్రధానిగా రేపు మోడీ ప్రమాణం! - Sakshi

15వ ప్రధానిగా రేపు మోడీ ప్రమాణం!

న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.  లోకసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా బీజేపీ మెజార్టీ సాధించి పెట్టిన సంగతి తెలిసిందే.  భారత దేశ 15వ ప్రధానిగా మోడీ ప్రమాణం స్వీకారం చేయనున్న కార్యక్రమానికి 3 వేల మంది విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, అతిధులు హాజరవ్వనున్నారు.  
 
సార్క్ దేశాల నుంచి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, భూటాన్ ప్రధాని షేరింగ్ తోగ్బే, నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కోయిరాలా, మాల్డీవ్ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ లు కూడా అతిధుల జాబితాల ఉన్నారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జరిగే కార్యక్రమంలో మోడీ, ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement