నా గొంతును వినిపించాలనుకుంటున్నా:నిర్భయ తల్లి | nirbhaya's mother worried about rape incidents | Sakshi
Sakshi News home page

నా గొంతును వినిపించాలనుకుంటున్నా:నిర్భయ తల్లి

Published Tue, Mar 3 2015 9:35 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

nirbhaya's mother worried about rape incidents

న్యూఢిల్లీ: దేశంలో చట్టం అంటే ఎవరికీ భయంలేదని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటన జరుగుతోందని.. కానీ అధికారంలో ఉన్నవారు, ప్రభుత్వం, కోర్టులో వాటిని చూడటం లేదా?అని ఆమె ప్రశ్నించారు. తన కూతరిపై అత్యాచారానికి ఒడిగట్టిన వారిని ఉరి తీయకుంటే అది సమాజాన్ని నిలువునా కాల్చేస్తుందన్నారు. అత్యాచారానికి ఒడిగట్టిన వారు సమాజాన్ని సవాల్ చేస్తున్నారని నిర్భయ తల్లి ఆందోళన వ్యక్తం చేశారు.

 

వాళ్లను ఉరి తీయకుంటే.. దేశంలోని ఆడపిల్లలకు ప్రమాదకరమన్నారు. దాదాపు ఏడాది కాలంగా నిర్భయ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని.. ఈ క్రమంలోనే తాను ప్రతిచోటకు వెళ్లి తన గొంతును వినిపించాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement