నామినేషన్ వేసేందుకే హైదరాబాద్ వచ్చా | Nirmala Sitharaman arrives in hyderabad, to file Rajya Sabha papers on June 21 | Sakshi
Sakshi News home page

నామినేషన్ వేసేందుకే హైదరాబాద్ వచ్చా

Published Fri, Jun 20 2014 12:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

నామినేషన్ వేసేందుకే హైదరాబాద్ వచ్చా - Sakshi

నామినేషన్ వేసేందుకే హైదరాబాద్ వచ్చా

హైదరాబాద్ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ (స్వతంత్ర) మంత్రి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటుకు నామినేషన్ వేసేందుకు హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. నిర్మలా సీతారామన్ శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కాగా నిర్మలా సీతారామన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసబ స్థానానికి ఎంపిక చేస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్న టీడీపీ నిర్మల అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. దాంతో ఆమె ఎన్నిక దాదాపు ఏకగ్రీవమైనట్లే. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement