
'పగటి కలలు కంటున్న సీఎం'
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా తగరని కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ ఎంపీ మహ్మద్ తస్లీముద్దీన్ అన్నారు.
కిషన్ గంజ్: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా తగరని కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ ఎంపీ మహ్మద్ తస్లీముద్దీన్ అన్నారు. బిహార్ లో సుపరిపాలన అందించడంలో విఫలమైన నితీశ్ ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 'నితీశ్ కుమార్ పీఎం అభ్యర్థిత్వానికి అనర్హుడు. సొంత రాష్ట్రంలో సుపరిపాలన అందించలేని వ్యక్తి దేశానికి నాయకత్వం ఎలా వహిస్తార'ని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
బిహార్ లో మద్యపాన నిషేధం విధించి నితీశ్ దేశమంతా ప్రచారం చేసుకుంటున్నారని, ప్రధానమంత్రి పదవి కోసం పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. బిహార్ లో హత్యలు పెరిగిపోయాయని, పాలన కుప్పకూలిందని తస్లీముద్దీన్ విమర్శించారు. ప్రభుత్వ విభాగాలపై పాలకులకు అదుపు తప్పిందని అన్నారు.