రిజర్వేషన్లలో మార్పులు చేసే యోచన ప్రభుత్వానికి లేదని ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.
ముంబై: రాబోయే నూతన విద్యా విధానంలో రిజర్వేషన్లలో మార్పులు చేసే యోచన ప్రభుత్వానికి లేదని మావన వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత విద్యా విధాన ముసాయిదాను కేబినెట్‌కు పంపే ముందు విద్యా రంగ నిపుణులతో చర్చిస్తామన్నారు.
రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లలో మార్పులు చేసే యోచన తమకు లేదని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థను మెరుగు పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.