న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందుకు వీలుగా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్‌టీఐ చట్టం కింద విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఈఎల్‌పీఓ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.