
నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిలభారత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియ పూర్తి అయింది. అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీకి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం లభించింది.
అధికారుల విభజన ఫైలుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతకం చేశారు. రెండు రాష్ట్రాలకు కేటాయించిన అధికారుల జాబితా ఎల్లుండు విడుదల చేసే అవకాశం ఉంది.