
మోదీజీ.. మీ ధైర్యం ఏమైంది?
చైనా ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గడంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు.
శ్రీనగర్: చైనా ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గడంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. వరల్డ్ వీగర్ కాంగ్రెస్ కార్యనిర్వహక కమిటీ ఛైర్మన్, చైనా ఉగ్రవాదిగా ప్రకటించిన దోల్కున్ ఇసాకు మంజూరు చేసిన వీసాను రద్దు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మోదీ ఛాతీ వైశాల్యం ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. మొదటి సారిగా భారత్ చైనాకు ఘాటైన సమాధానం చెప్పిందని గత కొద్దిరోజులు కేంద్ర ప్రభుత్వం స్వీయ అభినందన చేసుకుందని అంతలోనే చైనాకు తలొగ్గిండమేమంటని ఆయన ప్రశ్నించారు. ఈమేరకు ట్విట్టర్ లో వ్యాఖ్యలుచేశారు.
చైనాలోని తీవ్రవాదాన్ని ఇసా మద్దతు ఉందని, ఆయనపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నో్టీసు జారీ చేసిందని.. ఆయనను అరెస్టు చేసేందుకు అన్నిదేశాలు సహకరించాలని చైనా కోరిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనున్న సదస్సు కోసం దోల్కున్ ఇసాకు భారత్ వీసా మంజూరు చేసిన సంగతి తెలిసిందే.