
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు లక్ష్యాలు,ఈ నిర్ణయం పర్యవసానాలపై పార్లమెంటరీ కమిటీ గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను ప్రశ్నించింది. నోట్ల రద్దు ప్రభావాన్ని పూర్తిగా అంచనావేసేందుకు పలు మంత్రిత్వ శాఖల అధికారులను, రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించింది. గత ఏడాది నవంబర్ 8న ప్రకటించిన నోట్ల రద్దు వ్యవహారంపై మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.
ఇక నోట్ల రద్దు పర్యవసానాలపై ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్, సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్రలు పార్లమెంటరీ కమిటీకి వివరించారు. నల్లధనం నియంత్రణ, ఉగ్రకార్యకలాపాలు, డిజిటల్ లావాదేవీలపై నోట్ల రద్దు ప్రభావం గురించి పార్లమెంటరీ కమిటీ సభ్యులు అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం.
నోట్ల రద్దు బ్రాండ్ ఇండియా ప్రతిష్టను దెబ్బతీసిందని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment