నమో పెయిన్ కిల్లర్, నమో బామ్ | Pharmaceutical company launches NaMo painkiller balm, gel | Sakshi
Sakshi News home page

నమో పెయిన్ కిల్లర్, నమో బామ్

Published Sat, Jun 21 2014 10:45 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నమో పెయిన్ కిల్లర్, నమో బామ్ - Sakshi

నమో పెయిన్ కిల్లర్, నమో బామ్

ఏదైనా ఒక పేరు మంచి ప్రచారంలో ఉందంటే చాలు.. దాన్ని సొమ్ము చేసుకోవడం వ్యాపారులకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. ఈ విషయంలో హర్యానాలోని ఓ ఔషధాల కంపెనీ నాలుగాకులు ఎక్కువే చదివింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజల్లో ఉన్న క్రేజును సొమ్ము చేసుకోవాలనుకుంది. అంతే.. నిముసిలైడ్ అనే నొప్పి నివారణ మందుకు 'నమో' బ్రాండు పేరు పెట్టి మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి ఆదరణ కూడా బాగుందని సదరు ఔషధ కంపెనీ యజమాని చెబుతున్నారు. మందు ఒకటే అయినా, ఇప్పటి అమ్మకాలకు, ఇంతకు ముందున్న అమ్మకాలకు చాలా తేడా ఉందని ఆయన తెలిపారు.

హర్యానాలోని హల్ద్వానీ ప్రాంతంలో గల ఈ ఔషధ కంపెనీ నమో పేరుకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకునే ఇలా కొత్త పెయిన్ కిల్లర్ బామ్, జెల్ రెండింటినీ విడుదల చేసింది. 'నమో' పేరుతో ఇంతకుముందు టోపీలు, టీషర్టులు, వాచీలు కూడా అమ్ముడైన విషయం తెలిసిందే. అయితే ఇలా ఏకంగా మందులకే నమో పేరును వాడుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement