
చండీగఢ్ : హరియాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక ఐదు రోజులే మిగిలిఉండటంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.సోమవారం వల్లఢ్‌గఢ్‌లో తొలి ర్యాలీ జరగనుండగా, కురుక్షేత్ర జిల్లా థానేసర్‌లో ఈనెల 15న ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ఇక 18న జాట్ ప్రాబల్య హిస్సార్‌లో తుది ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ఫరీదాబాద్ జిల్లా వల్లభ్‌గఢ్‌లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తొలి ర్యాలీలో పాల్గొనే ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో హరియాణాలో ప్రాబల్య వర్గమైన జాట్ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 90 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడికానున్నాయి.