Haryana Assembly Eletion
-
హరియాణలో మోదీ ప్రచార హోరు..
చండీగఢ్ : హరియాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక ఐదు రోజులే మిగిలిఉండటంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.సోమవారం వల్లఢ్‌గఢ్‌లో తొలి ర్యాలీ జరగనుండగా, కురుక్షేత్ర జిల్లా థానేసర్‌లో ఈనెల 15న ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ఇక 18న జాట్ ప్రాబల్య హిస్సార్‌లో తుది ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ఫరీదాబాద్ జిల్లా వల్లభ్‌గఢ్‌లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తొలి ర్యాలీలో పాల్గొనే ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో హరియాణాలో ప్రాబల్య వర్గమైన జాట్ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 90 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
టిక్ టాక్ స్టార్‌కు బంపర్ ఆఫర్
అదంపూర్: టిక్ టాక్ చాలా మందిని ఓవర్ నైట్ స్టార్లను చేసింది. నాలుగు గోడల మధ్య ఉన్న ప్రతిభ టిక్ టాక్ పుణ్యమా అని బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది(శృతి మించితే వినాశనానికి దారితీస్తోంది). టిక్ టాక్ వీడియోలతో చాలా మంది సెలబ్రెటీలుగా మారుతున్నారు. అయితే టిక్ టాక్ స్టార్ అయిన ఓ మహిళకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ వరించింది. హరియాణకు చెందిన సొనాలీ ఫోగట్‌కు టిక్ టాక్‌లో లక్షల మంది ఫాలోవర్లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఆమె వీడియోలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ టిక్ టాక్ స్టార్ హరియాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనుంది. అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను బీజేపీ సొనాలీకి కేటాయించింది. గురువారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో సొనాలీ ఫోగట్ పేరును చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అదంపూర్‌లో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అదంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిషానికే కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి హరియాణ మాజీ సీఎం భజన్ లాల్ 2000 ,2005 ఎన్నికల్లో గెలుపొందారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి గత ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో భజన్ లాల్‌కు చెందిన కుటుంబం సభ్యులే గెలుపొందారు. దీంతో బీజేపీ అందపూర్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా టిక్ టాక్ స్టార్‌కు టికెట్ కేటాయిస్తూ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అదంపూర్ అసెంబ్లీ ఎన్నికపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. -
పూర్తి మెజార్టీ ఇవ్వండి: అమిత్ షా
చండీగఢ్: తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబటెట్టాలని హర్యానా ఓటర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. హర్యానా అభివృద్ధి తమతోనే సాధ్యమన్నారు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. పేదల భూములు లాక్కోని బిలడ్లర్లకు పంచిపెట్టిందని ఆరోపించారు. భూపేందర్ సింగ్ హుడా సర్కారు రైతులను దోచుకుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. యువతకు ఉపాధి కల్పించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు గుప్పించారు.