
పూర్తి మెజార్టీ ఇవ్వండి: అమిత్ షా
తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబటెట్టాలని హర్యానా ఓటర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారు.
చండీగఢ్: తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబటెట్టాలని హర్యానా ఓటర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. హర్యానా అభివృద్ధి తమతోనే సాధ్యమన్నారు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. పేదల భూములు లాక్కోని బిలడ్లర్లకు పంచిపెట్టిందని ఆరోపించారు.
భూపేందర్ సింగ్ హుడా సర్కారు రైతులను దోచుకుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. యువతకు ఉపాధి కల్పించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు గుప్పించారు.