
భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్
ఫోర్బ్స్ శక్తివంతుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ శక్తివంతులైన వ్యక్తుల
న్యూయార్క్: ఫోర్బ్స్ శక్తివంతుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ శక్తివంతులైన వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మోదీ 15 స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఇక జాబితాలో కొత్తగా చోటు దక్కించుకున్న మోదీని ఫోర్బ్స్ ఇండియా రాక్‌స్టార్‌గా అభివర్ణించింది. కాగా ప్రపంచంలోనే శక్తిమంతులైన 72 వ్యక్తులుగా ఫోర్బ్స్ పేర్కొన్న జాబితాలో రిలయన్స్ సంస్థల ఛైర్మన్ ముఖేష్ అంబానీ 36వ స్థానంలో, లక్ష్మీ మిట్టల్ 57, మైక్రోసాప్ట్ సీఈవో సత్యా నాదేండ్ల 64వ స్థానంలో నిలిచారు.