గజ్వేల్కే పరిమితం కానున్నప్రధాని పర్యటన | PM Narendra modi to launch Mission Bhagiratha in Gajwel on august 7th | Sakshi
Sakshi News home page

గజ్వేల్కే పరిమితం కానున్నప్రధాని పర్యటన

Published Thu, Jul 28 2016 1:25 PM | Last Updated on Wed, Aug 15 2018 2:12 PM

గజ్వేల్కే పరిమితం కానున్నప్రధాని పర్యటన - Sakshi

గజ్వేల్కే పరిమితం కానున్నప్రధాని పర్యటన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీఎంవోకు అధికారికంగా సమాచారం అందింది. వచ్చే నెల 7వ తేదీన ప్రధాని తెలంగాణలో తొలిసారి పర్యటించనున్నారు. ఆయన పర్యటన మెదక్ జిల్లా గజ్వేల్కు మాత్రమే పరిమితం కానుంది. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ను ప్రధాని ఆవిష్కరిస్తారు. ఏడో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్ చేరుకుంటారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం అదే రోజు సాయంత్రం 4.15కి హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు. హైదరాబాద్లో సాయంత్రం అయిదు గంటలకు బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీ బయల్దేరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement