నరేంద్రమోదీ శనివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాశీవిశ్వనాథ్ ఆలయం వరుకు మోదీ చేపట్టిన రోడ్ షోలో జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. దారిపొడవునా 'హర్ హర్ మోదీ.. హర్ ఘర్ మోదీ' అంటూ నినాదాలు చేశారు. మొదటగా పండిట్ మదన్ మోహన్ మాలవ్యా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. మోదీ యాత్ర రవిదాస్ గేట్ లంక, అస్సి, మదని, సోనార్పురా, గోడొవ్లియా, బస్పాటక్ ప్రాంతాల గుండా సాగుతోంది.
ఇవాళ సాయంత్రం కాశీవిద్యాపీఠ్ యూనివర్సిటీలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. మరోవైపు బీఎస్పీ,ఎస్పీలు సైతం ఇవాళ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో నేడు వారణాసి హోరెక్కిపోతోంది.