న్యూఢిల్లీ : వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో యూపీ పోలీసులు ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లపై కన్నేసి ఉంచారు. సోషల్ మీడియా వేదికలను పర్యవేక్షించేందుకు పోలీసులు సైబర్ అండ్ మీడియా సెల్‌ను ఏర్పాటు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో వివిధ సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతున్న పోస్ట్‌లు, చిత్రాలు, వీడియోలను యూపీ పోలీసు అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. యూపీ పోలీసులు ఇప్పటికే 50 వాట్సాప్ గ్రూప్‌లు, 70 మంది నెటిజన్లను గుర్తించిన యూపీ సైబర్ సెల్ పోలీసులు రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారిని ఇప్పటికే హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment