
రేపు రైతులతో మోదీ ముఖాముఖి
ప్రధాని మోదీ సోమవారం ఐదు రాష్ట్రాల రైతులతో వెబ్‌కాస్ట్ ద్వారా ముచ్చటించనున్నారు.
హైదరాబాద్ రైతులతో ప్రారంభం
సిమ్లా: ప్రధాని మోదీ సోమవారం ఐదు రాష్ట్రాల రైతులతో వెబ్‌కాస్ట్ ద్వారా ముచ్చటించనున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ నుంచి ప్రధాని గంటసేపు హైదరాబాద్, కడలూర్, జమ్మూ, జోర్హత్, పాలంపూర్ రైతులతో మాట్లాడి, పూలు, పంటలకు సంబంధించిన వంగడాలను విడుదల చేస్తారని పాలంపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ డెరైక్టర్ డా. సంజయ్ కుమార్‌తెలిపారు.
తొలుత హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు రైతులతో మోదీ మాట్లాడతారు. పీతాంబర్ అనే అధికోత్పత్తినిచ్చే పసుపు వంగడాన్ని వారు ప్రధానికి ప్రదానం చేస్తారు. బదులుగా అదే వంగడానికి చెందిన మొక్కలను రైతులు బహుమానంగా పొందుతారు. ఆయా ప్రాంతాల్లో చిన్న , సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం ఎలా సాయం చే స్తోందనే విషయాలను రైతులు మోదీతో చర్చిస్తారని సంజయ్ కుమార్ తెలిపారు.