
న్యూయార్క్: మహారాష్ట్రలోనే పుణెకు చెందిన శ్రీధర్ ఛిల్లాల్(82).. ప్రపంచంలోనే అతిపెద్ద చేతి గోర్లు కలిగిన వ్యక్తిగా 2016లో గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఎడమ చేతికి పెంచుకుంటున్న గోర్లను 1952 నుంచి కత్తిరించకపోవడంతో అవి ఏకంగా 9.1 మీటర్ల మేర పెరిగాయి. అయితే తాజాగా ఈ గోర్లను తొలగించుకోవాలని శ్రీధర్ నిర్ణయించారు. కత్తిరించిన అనంతరం తన గోర్లను భద్రపరచాలని శ్రీధర్ విజ్ఞప్తి చేయగా, అందుకు న్యూయార్క్‌లోని ‘రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియం’ ముందుకొచ్చింది. శ్రీధర్ విద్యార్థిగా ఉన్న సమయంలో స్కూల్ టీచర్ వేలికున్న పొడవాటి గోరును విరగ్గొట్టడంతో దెబ్బలు తిన్నారు. అప్పట్నుంచేæ గోర్లు పెంచడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment