
గ్రూప్ పేరు మార్చి.. గొడవ పడి!
పుణే : వాట్సాప్ గ్రూప్ చాటింగ్ లకే కాక, ఘర్షణలకు దారితీస్తోంది. గ్రూప్ పేరు మార్చినందుకు కాలేజీలో రెండు గ్రూపు విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుని, ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
పుణే : వాట్సాప్ గ్రూప్ చాటింగ్ లకే కాదు ఘర్షణలకూ దారితీస్తోంది. కేవలం గ్రూప్ పేరు మార్చినందుకు ఓ కాలేజీలో రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలవ్వగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన పుణేలోని గర్ వేర్ కాలేజీ సమీపంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అక్షయ్ దింకర్ గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం..
బీబీఏ చదువుతున్న సంకేత్ సాలుంకే(22) పుట్టినరోజు గురువారం కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు కొంతమంది విద్యార్థులు తమ కాలేజీ వాట్సాప్ గ్రూప్‌లో సబ్జెక్టు లైన్ ను మార్చారు. సంకేత్ పేరు మీద సబ్జెక్ట్ ను పెట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ మరో విద్యార్థి సబ్జెక్ట్ లైన్‌ను మార్చాడు. దీనిని సంకేత్ స్నేహితుడు దింకర్ వ్యతిరేకించాడు. దీంతో రెండు గ్రూపుల మధ్య మొదలైన గొడవ.. ఘర్షణకు దారితీసింది. తర్వాత రోజు కాలేజీలో ఎదురుపడిన రెండు గ్రూపులు పరస్పరం దాడిచేసుకున్నాయి. సంకేత్‌తోపాటు, అతని నలుగురు నలుగురి స్నేహితులపై ప్రత్యర్థి గ్రూపు ఆయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో దింకర్ తీవ్రంగా గాయపడ్డాడని ఇన్ స్పెక్టర్ చెప్పారు. ప్రస్తుతం దింకర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సంకేత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 22 మంది వ్యక్తులపై ఈ కేసు నమోదైంది. ఐదుగురిని అరెస్ట్ చేసి, ఐపీసీ సెక్షన్ కింద అభియోగాలు మోపారు.