ఆర్బీఐ చీఫ్‌ రాజన్ జీతం చాలా తక్కువే! | Raghuram Rajan Not Top Paid Executive At RBI: Report | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ చీఫ్‌ రాజన్ జీతం చాలా తక్కువే!

Published Sun, Apr 24 2016 7:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

ఆర్బీఐ చీఫ్‌ రాజన్ జీతం చాలా తక్కువే!

ఆర్బీఐ చీఫ్‌ రాజన్ జీతం చాలా తక్కువే!

ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి ఎవరంటే అందరూ చెప్పే పేరు ఆ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ కానీ..

న్యూఢిల్లీ: ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి ఎవరంటే అందరూ చెప్పే పేరు ఆ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్. కానీ, ఆయనకు నెలవారీ అందే జీతం మాత్రం మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే చాలా తక్కువేనని చెప్పాలి.

ఆర్బీఐ తాజాగా తన వైబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. రాజన్ అందుకునేది నెలకు రూ.1,98,700 వేతనం. ఇందులో రూ. 90 వేలు బేసిక్ పే కాగా, లక్షా పదిహేడొందలు డీఏ (కరువు భత్యం), మరో 7 వేలు ఇతర భత్యాల కింద రాజన్కు అందుతోంది. ఇక ఆర్బీఐలో పనిచేసే ఇతర ఉద్యోగులకు ఇంతకన్నా ఎక్కువ జీతమే అందుతోంది. ఆర్బీఐలో పనిచేసే గోపాలకృష్ణ సీతారామ్ హెగ్డే నెలవారీ జీతం కింద రూ. 4 లక్షల అందుకొంటుండగా.. ఆ తర్వాత అన్నామలై అరప్పులి గౌండర్ రూ. రెండు లక్షల ఇరవై వేలకు (రూ.  2,20,355)పైగా, వీ కందస్వామి రూ. రెండు లక్షల ఒక వెయ్యి వేతనంగా అంందుకుంటున్నారు. హెగ్డే, కందస్వామిలకు అందజేస్తున్న జీతభత్యాలలో కరువుభత్యం వివరాలను, వారు సంస్థలో ఏయే హోదాల్లో పనిచేస్తున్నారనే అంశాన్ని ఆర్బీఐ వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement