రోహిత్ మృతిపై రాహుల్ రాజకీయం: వెంకయ్య | rahul did politics on rohith suicide issue, says venkaiah | Sakshi
Sakshi News home page

రోహిత్ మృతిపై రాహుల్ రాజకీయం: వెంకయ్య

Published Fri, Jan 22 2016 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

rahul did politics on rohith suicide issue, says venkaiah

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపాటు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పాలన నాటి దారుణాలను పట్టించుకోని రాహుల్‌గాంధీ ఈ రోజు రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. కన్యాకుమారి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 2008 నుంచి2014 వరకు కాంగ్రెస్ హయాంలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఆ నాడు రాహుల్‌గాంధీ ఏమాత్రం చింతించలేదని విమర్శించారు. ఈ రోజు తగుదునమ్మా అంటూ బాధితులను పరామర్శిస్తూ రాజకీయం చేస్తున్నారన్నారు. సదరు విద్యార్థే తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కాదనే విషయాన్ని సూసైడ్ నోట్‌లో పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement