
అహ్మదాబాద్: తొలి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 24, 25 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా సనంద్, పోర్‌బందర్, మహిసగర్, అహ్మదాబాద్, గాంధీనగర్, దాహోద్ ప్రాంతాల్లో రాహుల్.. దళితులు, మత్స్యకారులు, వైద్యులు, టీచర్లు.. తదితర స్థానిక వర్గాలను కలుసుకుంటారని పార్టీ గుజరాత్ ప్రతినిధి మనీశ్ దోషి చెప్పారు.