అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది . ‘చింతన్ శిబిర్’ పేరిట మూడు రోజులు జరిగే పార్టీ సమావేశం మెహ్‌సనాలోని ఓ రిసార్టులో బుధవారం ప్రారంభమైంది. తొలి రెండు రోజులు ఇదే రిసార్ట్‌లో, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్న చివరి రోజు శుక్రవారం అహ్మదాబాద్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. తాజా ఎన్నికల్లో జిల్లాల వారీగా సాధించిన సీట్లు, 2019 లోక్‌సభ ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌పై ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశముంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన కాంగ్రెస్ పట్టణాల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ శుక్రవారం ప్రసంగిస్తారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ఈ శిబిరంలో పాల్గొంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment