ఇవీ దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులు
న్యూఢిల్లీ :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు ప్రకటించారు. శుక్రవారం సభకు సమర్పించిన అనంతరం పూర్తి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. గత బడ్జెట్‌లో తెలంగాణకు కేవలం రూ.601 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు గత బడ్జెట్‌లో రూ.2,195 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,406 కోట్లు కేటాయించటం విశేషం.
దక్షిణ మధ్య రైల్వేలో పలు ప్రాజెక్టులకు బడ్జెట్లో మంజూరైన నిధులు...
-నడికుడి- శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైన్‌కు రూ.340కోట్లు
-కడప-బెంగళూరు మధ్య రైల్వేలైన్‌కు రూ.240కోట్లు
-కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వేలైన్‌కు రూ.150కోట్లు
-గుంటూరు-గుంతకల్ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు రూ.124కోట్లు
-కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్‌కు రూ.430 కోట్లు
-ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు రైల్వేలైన్‌కు రూ.100 కోట్లు
-గుంటూరు-తెనాలి రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు రూ.50కోట్లు
-తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7 కోట్లు
-గూడూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.2.7 కోట్లు
-విజయవాడ-గుడివాడ లైన్ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగింపునకు రూ.130 కోట్లు
-తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.6 కోట్లు
-కాజీపేట- విజయవాడ మూడో లైన్కు రూ.100 కోట్లు
-కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు అనుమతి
- కొండపల్లి-కిరండోల్ మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి
- మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి
- హిందూపురం- చిత్రదుర్గం మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి
-మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి
- ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్‌లకు రూ.19 కోట్లు
-మునిరాబాద్- మహబూబ్ నగర్ రైల్వే లైన్కు రూ. 300 కోట్లు
-మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్కు రూ.350 కోట్లు
-అక్కన్న పేట-మెదక్ రైల్వే లైన్కు రూ. 196 కోట్లు
-భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్కు రూ. 300 కోట్లు
-కరీంనగర్-పెద్దపల్లి రైల్వే లైన్కు రూ.120 కోట్లు