న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటిస్థానంలో ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) శుక్రవారం తెలిపింది. రైల్వే శాఖలో మొత్తం 730 పెండింగ్ కేసులుండగా వీటిలో 350 కేసులు సీనియర్ అధికారులపైనే ఉన్నాయి.
తర్వాతి స్థానాల్లో 526 పెండింగ్ కేసులతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్ఎల్), 268 కేసులతో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఉన్నాయి. 193 కేసులు ఢిల్లీ ప్రభుత్వాధికారులపై ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల్లో వరుసగా 128, 82 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.