సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య విచారణ వాయిదా పడిన నేపథ్యంలో.. రామజన్మభూమి న్యాస్ మహంత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినా.. ఆలయ నిర్మాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని రామజన్మభూమి న్యాస్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో.. పార్లమెంట్ ద్వారా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని నృత్య గోపాల్ దాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉండగానే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని ఆయన చెప్పారు.
దేశంలోని మెజారిటీ ప్రజలు అయోధ్యలో రామాలయాన్ని కోరుకుంటున్నారని.. కోర్టుకూడా మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరిస్తుందనే నమ్మకం ఉందని నృత్య గోపాల్ దాస్ అన్నారు. అయోధ్య స్థలమంతా రాముడికి సంబంధించనదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment