నక్సల్స్‌తో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. అయితే వారు హింసపే వీడి భేషరతుగా ముందుకు రావాలన్నారు.
కొరాపుట్(ఒడిశా): నక్సల్స్‌తో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. అయితే వారు హింసపే వీడి భేషరతుగా ముందుకు రావాలన్నారు. ఆయన శుక్రవారమిక్కడ నక్సల్స్ సమస్యపై సమీక్ష నిర్వహించారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలోకొచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లభ్ధిపొందాలని సూచించారు.
తెలంగాణ, ఏపీల్లో మళ్లీ సమస్య: మిశ్రా
తెలంగాణ, ఏపీ, ఒడిశాల్లో నక్సల్స్ సమస్య మళ్లీ తలెత్తిందని సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్ ప్రకాశ్ మిశ్రా అన్నారు. కొంత కాలంస్తబ్దుగా ఉన్న నక్సల్స్ మళ్లీ తమ కార్యకలాపాలు ప్రారంభించారన్నారు.