Union Home Minister Rajnath Singh
-
కల్లోల కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం
-
కల్లోల కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : వేర్పాటు ఆందోళనలు, భారత సైన్యం తుపాకుల మోత, రాళ్లు విసిరే యువత, నడవని పాఠశాలలు, అప్రకటిత కర్ఫ్యూ.. గడిచిన ఏడాదిన్నర రోజులుగా కశ్మీర్‌లోయలో నిత్యం కల్లోల వాతావరణమే. దాదాపు వ్యవస్థలన్నీ కుప్పకూలిన కశ్మీర్‌లోయలో పరిస్థితులు తిరిగి చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఏడాది జులైలో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు ఎంతకూ చల్లారని సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చర్చల ద్వారా మాత్రమే లోయలో నెలకొన్న అశాంతిని తొలగించడం సాధ్యమవుతుదని, ఆ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రతినిధి ఏం చేయనున్నారు? : ‘కశ్మీరీలకు దగ్గరవ్వడం ద్వారానే వారి సమస్యలను పరిష్కరించొచ్చు’ అన్న ప్రధాని మోదీ మాటను అనుసరించి చర్చల ప్రతినిధిగా దినేశ్వర్ శర్మను నియమించారు. ఆయన.. భారత్ నుంచి విడిపోతామంటూ ఆందోళనలు చేస్తోన్న వేర్పాటువాదులతోనూ, రాజకీయ పార్టీలు, సంస్థలు, కీలక వ్యక్తులతోనూ చర్చలు జరిపి.. శాంతి పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఆయన చేసే సూచనలను కేంద్ర కేబినెట్ పరిగణలోకి తీసుకునే వీలుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో కశ్మీర్ వేర్పాటువాద ఆందోళనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
ఇక కులం, కశ్మీర్ లాంటి సమస్యలు ఉండవు
- 2022 నాటికి న్యూఇండియా సాకారం - అప్పటికి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం: రాజ్‌నాథ్ - ఆసక్తికరంగా మారిన కేంద్ర హోం మంత్రి ప్రతిజ్ఞ న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్నింటికీ 2022లోగా పరిష్కారం చూపుతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదం మొదలుకొని కుల వ్యవస్థ దాకా మొత్తాన్ని మార్చేస్తామన్నారు. న్యూఇండియా ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ‘సంకల్ప్ సే సిద్ధి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేయించిన ప్రతిజ్ఞపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘ఉగ్రవాదం, కశ్మీర్ సమస్య, నక్సలిజం.. ఇలా దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి. అయితే, వాటన్నింటినీ 2022లోగా పరిష్కరిస్తామని నేను భరోసా ఇస్తున్నాను. న్యూఇండియాను నిర్మిద్దామని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. రాబోయే నవభారతంలో సమస్యలకు తావులేదు’ అని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. అనంతరం.. సభికుల చేత.. ‘పేదరికం లేని, అవినీతి లేని, ఉగ్రవాదరహిత, మతవిద్వేషరహిత, కులరహిత, స్వచ్ఛభారత్‌ను నిర్మించుకుందాం’ అనే ప్రమాణాన్ని చేయించారు. ‘స్వాతంత్ర్య సమరయోధులు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెడితే 1947కు స్వాతంత్ర్యం సిద్ధించింది. అలానే న్యూఇండియా నిర్మాణం కోసం ఇప్పుడు(2017లో) ప్రతిజ్ఞచేసి.. 2022నాటికి సాకారం చేసుకుందాం’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కాగా, రాజ్‌నాథ్ ప్రకటనపై భిన్న స్పందనలు వెలువడ్డాయి. 2018లోగా చొరబాట్లను శాశ్వతంగా నిరోధిస్తామని, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని, నక్సల్స్ సమస్యకు ముగింపు పలుకుతామని గతంలో ప్రకటించినా, అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో తాజా ప్రకటన కూడా కేవలం ప్రకటనగానే మిగిలిపోతుందని విపక్షాల నేతలు పెదవి విరిచారు. -
పోలీసుల పనితీరు భేష్
డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ► యువత ఐసిస్ బాట పట్టకుండా బలగాలు కృషి చేశాయి ► ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశాయి ► పెద్ద నోట్ల రద్దుతో జాతి వ్యతిరేక శక్తులకు నిధులు ఆగిపోతాయి సాక్షి, హైదరాబాద్: దేశ అంతర్గత భద్రతలో కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల పాత్ర ప్రశంసనీయమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. యువత ఐసిస్ వైపు తప్పుదోవపట్టకుండా కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు సమన్వయంతో కృషి చేశాయని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్మూలించాయని కొనియాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లు, వామపక్ష తీవ్రవాదం, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులతో గడచిన ఏడాది కాలంగా దేశ అంతర్గత భద్రత పెను సవాళ్లను ఎదుర్కొందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో డీజీపీ, ఐజీపీల 51వ జాతీయ సదస్సును రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారుల మధ్య ఆరోగ్యదాయకమైన పోటీ ఉంటే చక్కని ఫలితాలు సాధించవచ్చన్నారు. పెద్ద నోట్ల రద్దుతో.. జాతి వ్యతిరేక శక్తులకు అందే నిధులు ఆగిపోతాయన్నారు. రాష్ట్రాలు, కేంద్ర సంస్థల పోలీసు సిబ్బంది ఉత్తమ విధానాలపై పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స, ప్రాసిక్యూషన్ వంటి వివిధ భద్రతా విభాగాల సేవలను సముచితంగా గుర్తించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా హోంశాఖ, ఇంటెలిజెన్స బ్యూరోకు చెందిన అధికారులకు ఇండియన్ పోలీస్ పతకాలను రాజ్‌నాథ్ ప్రదానం చేశారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో.. భద్రతపరంగా దేశం ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై చర్చలు జరిపి, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలపై ఒక కార్యాచరణను రూపొందిస్తారు. అంతకుముందు రాజ్‌నాథ్ అకాడమీలో సర్దార్ పటేల్ విగ్రహం వద్ద, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అమరవీరుల స్మారకం వద్ద పూలమాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు కిరెన్ రిజిజు, హన్సరాజ్ గంగారామ్ అహిర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్ రుషి, అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ, భద్రత, నిఘా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అసెంబ్లీ సీట్లను వెంటనే పెంచండి
కేంద్ర హోంమంత్రికి సీఎం కేసీఆర్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్ఫూర్తిని తూ.చ. తప్పకుండా పాటిస్తూ శాసనసభ నియోజకవర్గాల పెంపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. పార్టీ ఎంపీలు, ఉన్నతాధికారులతో కలసి గురువారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో రాజ్‌నాథ్‌తో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపును ఉద్దేశించే చట్టంలో తగిన నిబంధనలు పొందుపరిచారని, కానీ ఈ అంశంపై అటార్నీ జనరల్ ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయం (రాజ్యాం గంలోని ఆర్టికల్ 170 ప్రకారం సీట్ల పెంపు సాధ్యం కాదంటూ) అందుకు విరుద్ధంగా ఉందన్నారు. అందువల్ల ఈ న్యాయ సంఘర్షణకు తెరదించాలని కోరారు. సీట్ల పెంపు ఉద్దేశం లేకుంటే విభజన చట్టంలో ఆ నిబంధన ఉండేదే కాదని కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ద్వారా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇతర ఏ ఆర్టికల్ కూడా వాటిపై పైచేయి సాధించజాలదని, ఆర్టికల్ 170 అందుకు మినహాయింపు కాదని కేసీఆర్ వివరించారు. అందువల్ల రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు అడ్డంకిగా ఉన్న సాంకేతికపరమైన అంశాలను పరిష్కరిస్తూ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇందుకు హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్టు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేసీఆర్ ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేటాయించిన ఉన్నతాధికారులతో ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మరింత మందిని కేటాయించాలని కోరారు. ఆ తీర్పు అన్నింటికీ వర్తించదు పదో షెడ్యూల్లోని సంస్థల విభజనపై తలెత్తిన గందరగోళంపై కేసీఆర్ హోంమంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పదో షెడ్యూల్లోని అన్ని సంస్థలకూ వర్తింపచేయాలనడం అర్థరహితమని ఆయన వివరించినట్టు తెలిసింది. జనాభా ప్రాతిపదిక అనేది విభజన చట్టం స్ఫూర్తి కాదని, ఈ ప్రాతిపదికన పదో షెడ్యూలులోని సంస్థలన్నింటినీ విడదీయాలనడం తెలంగాణకు అన్యాయం చేయడమే అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్లకు రూ. 300 కోట్లివ్వండి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో గోదావరి, ప్రాణహిత నదుల వెంట జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 1,290 కోట్లు కేటాయించినందుకు కేంద్రానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని అనుమతులు పొందిన ఈ రహదారుల నిర్మాణ పనుల ప్రారంభానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసేందుకు చొరవ చూపాలని రాజ్‌నాథ్‌ను కోరారు. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యంగల ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి మరో రూ. 300 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్‌నాథ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కాళేశ్వరం నుంచి అర్జున్‌గుట్ట వరకు రహదారి, కాళేశ్వరం వద్ద కిలోమీటరు పొడవైన వంతెన (గోదావరి పై), రాచర్ల-వేమనపల్లి రహదారి, సోమనిగూడెం రహదారి, గూడెం-బాబా సాహెబ్ రహదారుల నిర్మాణానికి మరో రూ. 300 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాజ్‌నాథ్‌ను కలసిన వారిలో పార్టీ పార్లమెంటరీ విభాగం చైర్మన్ కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి, పార్టీ విప్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు. -
వాజ్‌పేయిలా కశ్మీరీల హృదయాలు గెలుచుకోండి
న్యూఢిల్లీ: రగులుతున్న కశ్మీర్ ప్రజలతో చర్చించి లోయలో సమస్యను పరిష్కరించాలని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని మోదీని కోరారు. ‘కశ్మీరీలతో మాట్లాడటానికి ఇది సరైన సమయం. ఈ విషయంలో ప్రధాని చొరవ చూపుతారని ఆశిస్తున్నా. నాడు వాజ్‌పేయిలా నేడు మోదీ కూడా సమస్యను పరిష్కరించి కశ్మీరీల హృదయాలు గెలవాల్సిన అవసరం ఉంది’ అని మెహబూబా అన్నారు. కశ్మీర్లో తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం ఇక్కడ సమీక్షించారు. ఇందులో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, జాతీయ భద్రతా సలహాదారు ఏకే దోవల్‌తో పాటు మెహబూబా పాల్గొన్నారు. లోయలో నెలకు పైగా సాగుతున్న హింసతో 55 మంది పౌరులు మరణించారని, ఎంతో మంది గాయపడ్డారని మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-పాక్‌లకు తమ రాష్ట్రం ఓ వారధిలా ఉండగలదన్నారు. కశ్మీర్ అల్లర్లపై ప్రధాని ఇంత వరకు నోరు విప్పకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
'ఫ్రెండ్స్‌నయితే మార్చుకోగలం కానీ...'
న్యూఢిల్లీ: కుదిరితే స్నేహితులను మార్చుకోవచ్చేమోగానీ.. పొరుగువారిని మాత్రం మార్చలేమని కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్‌లో సార్క్ సమావేశానికి వెళ్లిన ఆయన ఈ సందర్భంగా తాను విన్న, చూసిన అనుభవాలను రాజ్యసభలో పంచుకున్నారు. పాక్ వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పాక్‌కు మర్యాద తెలియదని పరోక్షంగా చెప్పారు. 'మనం స్నేహితులను మార్చుకోవచ్చు.. పొరుగువారిని కాదు. మన ప్రధాని (నరేంద్రమోదీ) చాలా కాలంగా పాక్ తో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. వారితో ఎప్పుడూ మంచి ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. పాక్ ప్రవర్తనకు నేను లంచ్ కూడా చేయకుండానే వచ్చాను. అయితే, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రతి ఒక్కరిని లంచ్‌కు పిలిచి ఆయన కారులో వెళ్లారు. నేను కూడా వెళ్లొచ్చాను. ఈ విషయంలో నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు. అయితే, ఒక అతిథిని ఆహ్వానించినప్పుడు దానికి తగిన ఏర్పాట్ల విషయంలో కొన్ని అంశాలు పాటించాలి. అది మన బాధ్యత కూడా. కానీ, అదేది పాక్ వద్ద లేదు. ఉగ్రవాదంపై తన స్పీచ్ ను పాక్ బ్లాక్ చేసిందని మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను.. ఇస్లామాబాద్ లోని లగ్జరీస్ సెరేనా హోటల్ లో జరిగిన కార్యక్రమానికి నాతోపాటు వచ్చిన ప్రతినిథులను, మీడియాను మాత్రం లోపలికి అనుమతించలేదు. ఇది చెప్పడానికే కాస్తంత ఇబ్బందిగా ఉంది' అంటూ రాజ్ నాథ్ తన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మొత్తం రాజ్యసభ పాక్ తీరును ఖండించింది. -
మోదీని ఇబ్బంది పెట్టేందుకే!
న్యూఢిల్లీ: ఇషత్ర జహాన్ ఎన్కౌంటర్ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మాయం చేసి.. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని ఇబ్బందులు పెట్టేందుకే ప్రయత్నించిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో తెలిపారు. ఇషత్ లష్కరే తోయిబా ఉగ్రవాది అనివిచారణలో వెల్లడైనా.. మోదీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వాస్తవాలను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇషత్ర కేసుపై సావధాన తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మరుగున పడేసిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఓ పక్క విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నా.. చిదంబరంపై దాడిని కొనసాగించారు. ‘ఉగ్రవాదానికి రంగు, మతం, జాతి ఉండవు. కానీ సెక్యులర్ అని చెప్పుకునే వాళ్లు ఉగ్రవాదానికి రంగు పూస్తారు.’ అని రాజ్‌నాథ్ తెలిపారు. ముంబై కోర్టు ముందు డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం, యూపీఏ సర్కారు ఆగస్టు6, 2009న గుజరాత్ హైకోర్టు ముందు దాఖలు చేసిన తొలి అఫిడవిట్ వంటి వాటిని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘హెడ్లీ వెల్లడించింది.. ఇషత్ర లష్కరే ఉగ్రవాదని తేల్చి చెప్పిన రెండో ఆధారం. మొదటిది.. యూపీఏ తొలి అఫిడవిట్లోనే స్పష్టమైంది’ అని అన్నారు. అప్పటి అటార్నీ జనరల్ జీఈ వాహనవతికి.. మాజీ హోం సెక్రటరీ జీకే పిళ్లై రాసిన లేఖ, ఈ కేసుకు సంబంధించిన ఇతర కీలక డాక్యుమెంట్లను కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. దీనిపై తమ శాఖలో అంతర్గత విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై సరైన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు. -
నక్సల్స్‌తో చర్చలకు సిద్ధం: రాజ్‌నాథ్
కొరాపుట్(ఒడిశా): నక్సల్స్‌తో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. అయితే వారు హింసపే వీడి భేషరతుగా ముందుకు రావాలన్నారు. ఆయన శుక్రవారమిక్కడ నక్సల్స్ సమస్యపై సమీక్ష నిర్వహించారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలోకొచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లభ్ధిపొందాలని సూచించారు. తెలంగాణ, ఏపీల్లో మళ్లీ సమస్య: మిశ్రా తెలంగాణ, ఏపీ, ఒడిశాల్లో నక్సల్స్ సమస్య మళ్లీ తలెత్తిందని సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ ప్రకాశ్ మిశ్రా అన్నారు. కొంత కాలంస్తబ్దుగా ఉన్న నక్సల్స్ మళ్లీ తమ కార్యకలాపాలు ప్రారంభించారన్నారు. -
‘విభజన’ వేగం పెంచండి
కేంద్ర హోంమంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన అంశాల అమలు ఇంకా మిగిలే ఉందని, సాధ్యమైనంత త్వరగా వాటిని అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రాజ్‌నాథ్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్... ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అధికారుల విభజన వివిధ స్థాయిల్లో ఇంకా పూర్తవలేదు. సంబంధిత విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనందున అధికారుల కొరతతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఎవరైనా డెప్యుటేషన్‌పై రాదలిస్తే త్వరితగతిన సంబంధిత అభ్యర్థనలను సానుకూలంగా పరిష్కరించండి. తెలంగాణలో నగర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఐపీఎస్ అధికారుల సంఖ్యను 112 నుంచి 141కు పెంచాలి’’ అని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిపి అసెంబ్లీ స్థానాలను పెంచాలని, ఇందుకు వీలుగా రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలన్నారు. అంతకుముందున్న చట్టాలతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పెంపు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘‘రెండు రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ ఉన్న సంగతిని హోంమంత్రి ప్రస్తావించారు. ఈ సమావేశాల్లోనే చట్ట సవరణకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు’’ అని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి సమావేశ వివరాలు వెల్లడించారు. అలాగే గోదావరి, ప్రాణహిత నదుల వెంట ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ 330 కి.మీ. మేర నిర్మించ తలపెట్టిన రహదారికి అన్ని అనుమతులిచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశ వరావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌కు అపూర్వ ఆదరణ: జితేందర్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాని, కేంద్ర మంత్రులు అపూర్వంగా ఆదరించారని...ఇప్పటివరకు విన్నవించిన సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించే పరిస్థితి కనిపిస్తోందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హోంమంత్రితో ముఖ్యమంత్రి, ప్రతినిధి బృందం భేటీ అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. విభజన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. హైకోర్టును విభజించాలని సీజేఐకి వినతి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు విభజన జరపాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ టి.ఎస్. ఠాకూర్‌ను కలిశారు. హైకోర్టు విభజించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సూచనల మేరకు తొలుత తాము తెలంగాణ హైకోర్టు కోసం గచ్చిబౌలిలో తాత్కాలిక వసతిని గుర్తించామని, ఆ ప్రతిపాదనలను పంపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని...ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనాలు నిర్మాణమయ్యేంతవరకు తామేమీ చేయలేమన్న రీతిలో వ్యవహరిస్తోందని సీఎం వివరించినట్టు సమాచారం. అందువల్ల ప్రత్యేక హైకోర్టు ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. జూనియర్ సివిల్ జడ్జి, ఇతర న్యాయాధికారుల నియామకాలను కూడా హైకోర్టు విభజన జరిగే వరకు చేపట్టరాదని సీజేఐకి కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు తెలియ వచ్చింది. -
'వారికి సెల్యూట్ చేస్తూనే ఉంటాను'
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి జరిగిన ఘటనలో పాకిస్థాన్ ముష్కరులకు ఎదురొడ్డి పోరాడి అమరులైనవారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి జరిగి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి అమరవీరులకు అంజలి ఘటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాడి సమయంలో ధీటుగా పోరాడి పార్లమెంటులోకి ఉగ్రవాదులను అడుగుపెట్టకుండా చేసి ప్రాణాలు తృణపాయంగా వదిలేసిన వారి త్యాగాలకు తానెప్పుడూ సెల్యూట్ చేస్తూనే ఉంటానని అన్నారు. వారి త్యాగం భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. తమ ప్రభుత్వం దేశంలో అసహనాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు నిరంతరం కృశిచేస్తుందని అన్నారు. భారత్ ను మరింత సురక్షితమైన దేశంగా మార్చేందుకు, మరింత లౌకిక రాజ్యంగా తీర్చి దిద్దేందుకు అనునిత్యం ప్రయత్నిస్తామని అన్నారు. -
ఏపీది కక్షసాధింపు చర్య
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌కు కవిత ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆమె కేంద్ర మంత్రిని కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే పట్టుబడిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటుచేసిందని, తెలంగాణకు సంబంధించిన అధికారులపై మాత్రమే కాకుండా సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదు చేసిందని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హోంమంత్రి స్పందిస్తూ సిట్ దర్యాప్తు గురించి తన దృష్టికి రాలేదని, అలా ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసినట్టు కవిత మీడియాకు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. కాల్‌డేటాలోని వివరాలు బహిర్గతమైతే దేశ అంతర్గత భద్రతకే ఇబ్బంది కలుగుతుందని మంత్రికి వివరించినట్టు తెలిపారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నుంచి కూడా కాల్ డేటా, ట్యాపింగ్ వివరాలు వెల్లడించాలన్న విజ్ఞప్తి వస్తోందని, వీటిని బయటకు వెల్లడించడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరగుతుందని వివరించినట్టు తెలిపారు. రిషితేశ్వరి కేసు సీబీఐకి ఇవ్వాలి.. నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి బలవన్మరణం ఘటనలో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు కవిత పేర్కొన్నారు. ఏపీ సీఎం సమగ్ర విచారణ జరిపిస్తారన్న నమ్మకం లేదని చెప్పినట్టు చెప్పారు. హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. -
బిహార్‌లో జేపీ స్మారకం
కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లు గడచిన సందర్బంగా.. సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్‌కు బిహార్‌లోని ఆయన జన్మస్థలంలో జాతీయ స్మారకాన్ని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి సారథ్యం వహించిన జేపీ గౌరవార్థం చప్పారా జిల్లాలోని లాలా కా టోలా, సితాబ్, డియారాలో జాతీయ స్మారకాన్ని నిర్మించాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జేపీ స్మారకంలో ఒక ప్రదర్శనశాల, ప్రజాస్వామ్యంపై అధ్యయనం, పరిశోధనకు ఒక సంస్థ తదితరాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో జేపీ స్మారకాన్ని నెలకొల్పటం ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేందుకేనన్న వాదనను తోసిపుచ్చారు. కాగా, దేశంలో ఆరు కొత్త ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), బుద్ధగయ (బిహార్), సిర్మౌర్ (హిమాచల్‌ప్రదేశ్), నాగ్‌పూర్ (మహారాష్ట్ర), సంబల్పూర్ (ఒడిశా), అమృత్సర్ (పంజాబ్)లలో ఏర్పాటు చేస్తారు. సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా పేరును రిన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకు.. ఆ సంస్థ వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేందుకు సెక్షన్-3 కంపెనీగా రిజిస్టరు చేసుకునేందుకు అనుమతివ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పాస్‌పోర్టుల జారీపై మోదీ అసంతృప్తి.... పాస్‌పోర్టుల పంపిణీ అసమర్థంగా ఉందని, కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోందని ప్రధానిఅసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు నిర్దేశించారు. ప్రగతి (సానుకూల పాలన, సమయానికి అమలు) ఐటీ ఆధారిత వేదిక ద్వారా బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలను ప్రస్తావించారు. -
ప్రధానితో రాజ్‌నాథ్ భేటీ
‘మోదీగేట్’పై చర్చ! న్యూఢిల్లీ/జైపూర్: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ వ్యవహారంలో ప్రభుత్వ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వారిరువురూ.. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలు లలిత్ మోదీకి సహకరించడంపై రాజుకున్న వివాదం, తదనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కాగా, సుష్మా స్వరాజ్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం.. రాజె విషయంలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. రాజస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర రాథోర్ మాత్రం.. సీఎం పదవికి రాజె రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు, వసుంధర రాజె బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అపాయింట్మెంట్ కోరలేదని రాజే కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వివాదంలో తన వివరణను వసుంధర రాజె బుధవారమే షాకు ఫోన్లో ఇచ్చారని సమాచారం. ముస్లింలకు శుభాకాంక్షలు న్యూఢిల్లీ: ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ వారికి శుభాకాంక్షలు తెలిపా రు. ఈ పవిత్రమాసం ప్రతి ఒక్కరి జీవితం లో శాంతి సంతోషాలను తీసుకువస్తుందని భావిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. సమాజంలో సామరస్యాన్ని, ఐకమత్యాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నానన్నారు. -
కుంభకోణాలపై దర్యాప్తు చేయండి
హోంమంత్రి, ఆర్థికమంత్రికి వైఎస్సార్సీపీ బృందం వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. జగన్ వెంట పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీలు పి.వి. మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ హామీలు, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్‌పై, అవినీతి వ్యవహారాలపై వినతిపత్రాలు సమర్పించారు. వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ.. థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్థ్యానికి రూ. 5.5 కోట్లు దాటరాదన్నది అందరికీ తెలిసిందే. కానీ కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఒక మెగావాటుకు రూ. 8 కోట్ల వరకు అనుమతించారు. ఒకవైపు స్టీలు ధర మెట్రిక్ టన్నుకు రూ. 60 వేల నుంచి రూ. 40 వేలకు తగ్గింది. అయినా చంద్రబాబునాయుడు ఒక్క సివిల్ పనుల వ్యయాన్నే రూ.2,300 కోట్ల మేర అదనంగా అనుమతించారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఒక మెగావాట్‌కు రూ. 6 కోట్లు దాటింది. బాబుకు బినామీగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్టీపీపీకి చెందిన కాంట్రాక్టర్లందరూ బలవంతంగా తప్పుకునే పరిస్థితి తెచ్చారు. ఆ తరువాత ధరలు సమీక్షించి సీఎం రమేశ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 22 శాతం ఎక్సెస్ చేసిన వారికి టెండర్లు కట్టబెట్టారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా జీవో నెంబర్-22 జారీ చేశారు. భారీగా ముడుపులు అందుకుని అదనపు మద్యం ఉత్పత్తి చేసేందుకు ఎంపిక చేసిన డిస్టలరీలకు అనుమతులిచ్చారు. తమకు అనుకూలమైన పరిశ్రమలకు అడగకుండానే రాయితీలు ఇచ్చారు. వైఎస్సార్ జిల్లాలోని బెరైటీస్ బేసిక్ ధరను తగ్గించి ఖజానాకు భారీ నష్టం కలిగించారు. -
మన ముస్లింలు జాతీయ వాదులు
లక్నో: భారతీయ ముస్లింలు జాతీయవాదులని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఉగ్రవాదానికి వారెన్నడూ మద్దతు పలకలేదన్నారు. ఇస్లామిక్ స్టేట్ వంటి మతచాంధస ఉగ్రవాద సంస్థలకు భారత్‌లో స్థానం కల్పించలేదన్నారు. ఉగ్రవాదాన్ని ఏదో ఒక మతంతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. మదన మోహన్ మాలవీయ మిషన్ ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న రాజ్‌నాథ్.. ఉగ్రవాద సవాలును ఎదుర్కొంటున్న దేశాలన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరు సాగించాలన్నారు. ఉగ్రవాద బాధిత దేశాల్లో ఒకటైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కలిసి రావాలన్నారు. టైస్టులకు టైస్టులతోనే సమాధానం చెప్పాలంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో.. ‘ఉగ్రవాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఒక్క భారత్‌కే కాదు.. ప్రపంచమంతటికీ తెలుసంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నకిలీ కరెన్సీ నోట్లు ఉగ్రవాద వ్యాప్తికి ఉపయోగపడ్తున్నాయని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఆర్థిక వృద్ధికి తోడ్పడిన నిర్ణయాల్లో బ్యాంకుల జాతీయీకరణ అత్యంత ముఖ్యమైనదని ప్రశంసించారు. తమ ప్రభుత్వ ఆర్థికపరమైన నిర్ణయాల వల్ల త్వరలోనే రెండంకెల వృద్ధిరేటును అందుకోగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ మహా సంపర్క్ అభియాన్‌ను ప్రారంభిస్తూ.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ‘మోదీ ఏడాది పాలనపై చర్చ మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుతుదోంది. భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారుతోందన్న విషయం విదేశీ పర్యటనల సందర్భంగా మోదీకి లభిస్తున్న స్వాగత సత్కారాల తీరును చూస్తే అర్థమవుతుంది. 2025 నాటికి భారత్ సూపర్ పవర్‌గా మారుతుంది’ అని అన్నారు. -
కేంద్రంతో ఆప్ ‘ఢీ’!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామక అంశంలో కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కయ్యానికి కాలు దువ్వుతోంది. బ్యూరోక్రాట్లకు సంబంధించి అత్యున్నత పదవి అయిన సీఎస్ ఎంపిక కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. వారలో నుంచి ఒకరిని ఎంచుకొని సీఎస్‌గా నియమించుకోవాలని సూచించింది. అయితే, కేంద్రం పంపిన ప్యానల్లో ఢిల్లీ సర్కారు సూచించిన ఆర్.ఎస్.నేగీ పేరు లేదు. దీంతో కేంద్రం పంపిన ఈ ప్యానల్‌ను తిరస్కరించాలనే నిర్ణయానికి ఆప్ సర్కారు వచ్చింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 1984 బ్యాచ్‌కి చెందిన ఆర్.ఎస్.నేగీని సీఎస్‌గా నియమించాలని ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతోంది. సీఎస్‌గా నేగీ పేరును ఖరారు చేయించడం కోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని గురువారం సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కలిశారు. నేగీ గతంలో ఢిల్లీ ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ జల్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై అతనికి మంచి అవగాహన ఉందని చెప్పారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని రాజ్‌నాథ్‌ని కోరారు. కానీ రాజ్‌నాథ్ అందుకు అంగీకరించకుండా, వారి విజ్ఞప్తిని తిరస్కరించారు. అతన్ని నియమించడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటని కేంద్రాన్ని ఆప్ ప్రశ్నిస్తోంది. ఐఏఎస్ రేసులో ఉన్న ఇతర అధికారులతో పోలిస్తే నేగీ చాలా జూనియర్ అని, అతని నియమించడం సర్వీస్ రూల్స్‌కి విరుద్ధం అని కేంద్రం వాదిస్తోంది. వివిధ స్థానాల్లో అతని కంటే సీనియర్లైన ఏజీఎంటీయూ కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారులు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నేగీని నియమించడం సరికాదని ఢిల్లీ సర్కారుకి కేంద్రం వివరించింది. కాగా, ఆప్ మాత్రం కేంద్రం వాదనను వ్యతిరేకిస్తోంది. మరి అలాంటి జూనియర్ అధికారిని అరుణాచల్‌ప్రదేశ్ వంటి సమస్యాత్మక ప్రాంతానికి సీఎస్‌గా నియమించారని ప్రశ్నిస్తోంది. కేంద్రం సహకరించాలి.. ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా అంచనాలను పెట్టుకున్నారని, వారి కోసం రూపొందించే పథకాల అమలులో కేంద్రం తప్పక సహకారం అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కోరింది. -
కేంద్ర హోం మంత్రిని కలిసిన కేజ్రీవాల్
రాజధానిలో శాంతి భద్రతలు, సీఎస్ నియామకంపై చర్చ న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడటానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గురువారం కలిశారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. రాజధానిలో శాంతి భద్రత పరిరక్షణ కోసం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని హోం మంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియా శనివారం ఉద్యోగ విరమణ చేయనుండటంతో నూతన సీఎస్ నియామకంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నూతన సీఎస్ నియామక రేసులో 1984 బ్యాచ్ ఐఏఎస్ కేడర్‌కి చెందిన ఆర్.ఎస్.త్యాగి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
ఐఎస్ విస్తరణ ఆందోళనకరమే!
డీజీపీల సదస్సులో రాజ్‌నాథ్ ⇒ పాక్ తన బుద్ధి మార్చుకోవడం లేదు ⇒ సదస్సులో గుర్రుపెట్టి బజ్జున్న సీబీఐ చీఫ్ గువాహటి: భారత్‌లో కొందరు యువకులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులవడంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోబోదని స్పష్టంచేశారు. పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వేతర శక్తుల ముసుగులో భారత్‌ను అస్థిరపరిచేందుకు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. శనివారమిక్కడ డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్‌కు ఏదో ఒక రూపంలో హాని చేయాలన్న బుద్ధిని పాకిస్తాన్ ఇప్పటికీ మార్చుకోలేదన్నారు. ఐఎస్ మిలిటెంట్ సంస్థ నుంచి ముంబైకి చెందిన ఆరిఫ్ మజీద్ అనే యువకుడు భారత్‌కు తిరిగిరావడాన్ని ప్రస్తావించారు. ‘‘ఈ సంస్థ సిరియా, ఇరాక్‌లకు అవతల పుట్టినా దీని జాడ్యం భారత ఉపఖండానికి విస్తరిస్తోంది. ఆరిఫ్‌ను అరెస్టు చేయడం ఆయనను బాధించడానికి కాదు’ అని చెప్పారు. భారత్‌లోని ముస్లింలు దేశభక్తి కలవారని అన్నారు. లష్కరే తోయిబా వంటి సంస్థలతో భారత్ భద్రతకు ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుందని ఇంటెలిజెన్స్ విభాగం డెరైక్టర్ ఆసిఫ్ ఇబ్రహీం అన్నారు. కాకాగా దేశభద్రత, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుండగా ఈ సదస్సుకు హాజరైన సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా మాత్రం ఇవేవీ పట్టనట్టు హాయిగా కునుకేశారు! రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతుండగా.. ఆయన గుర్రుపెట్టి నిద్రపోవడం గమనార్హం.