
సరిహద్దుల్లో సొరంగాల వేట
సరిహద్దుల్లోని సాంబా జిల్లాలో 70 అడుగుల పొడవైన సొరంగం ద్వారా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ మరింత అప్రమత్తమైంది.
జమ్ము: సరిహద్దుల్లోని సాంబా జిల్లాలో 70 అడుగుల పొడవైన సొరంగం ద్వారా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ మరింత అప్రమత్తమైంది. ఇంకా ఇలాంటి సొరంగ మార్గాలేమైనా ఉన్నాయోమోనన్న అనుమానంతో సరిహద్దు జిల్లాలైన జమ్ము, సాంబా, కతువాలను జల్లెడ పడుతోంది. ఉగ్రవాదులకు ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా పూర్తిస్థారుులో ఈ ప్రాంతాలను శోధిస్తున్నట్టు బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సాధారణ మొబైల్ తదితర పెట్రోలింగ్, మూడంచెల కంచెతో పాటు హాక్ ఐలను కూడా ఏర్పాటు చేసింది. సాంబా జిల్లా చమ్లియాల్‌రాంగఢ్ సెక్టారులో సొరంగం ద్వారా భారత్‌లోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చిన కథనాలపై జమ్ము ఫ్రాంటైర్ బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీకే ఉపాధ్యాయ స్పందించారు. ఇది చిన్నపాటి ఎలుక కన్నం లాంటిదని, ఈ మార్గాన్ని ఉగ్రవాదులు ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు.
హిజ్‌బుల్ కమాండర్ కోసం గాలింపులు
శ్రీనగర్: హిజ్‌బుల్ ముజాహిద్దీన్ కమాండర్ జాకిర్ రషీద్‌ను పట్టుకొనేందుకు భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారుు. అతడి రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. అప్రమత్తమైన భద్రతా దళాలు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గాలింపులు చేపట్టాయి. ఇందులో భాగంగా జాకిర్ తలదాచుకుంటున్న ఓ ప్రాంతాన్ని కనిపెట్టారు. ఒక వీడియోను ఇక్కడి నుంచే తీసినట్లు భావిస్తున్నారు.