
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అంశాలపై దాఖలైన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం విచారించింది. జనవరి 17 న తుది వాదనలు విని తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ జవీద్ రహీంతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
ఏపీ, తెలంగాణల్లో యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారంటూ రెలా అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది. యంత్రాలతో తవ్వకాలు నిలిపివేయాలని గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనపై తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఎన్జీటీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment