న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సమాచార హక్కు(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు కార్యకర్త వెంకటేశ్ నాయక్ దాఖలుచేసిన ఓ పిటిషన్‌ను విచారిస్తూ కమిషన్ ఈ విధంగా పేర్కొంది.
జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఉద్యోగి ఒకరు గతంలో సిట్ చైర్మన్ ఎంబీ షాకు రాసిన లేఖ నకలు ప్రతిని ఇవ్వాలని వెంకటేశ్ కోరగా, అందుకు ఆదాయపు పన్ను విభాగం నిరాకరించింది. సిట్‌ను పబ్లిక్ అథారిటీగా గుర్తిస్తూ ఆదేశాలు జారీచేయాలని ఆయన సీఐసీని ఆశ్రయించారు. ‘ ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన, నల్లధనం వెలికితీత లాంటి కీలక విధులు నిర్వర్తిస్తున్న సిట్ ప్రజల కోసమే పనిచేస్తుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద తెలుసుకునే హక్కు పౌరులకుంది’ అని కమిషనర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment