స్మార్ట్‌సిటీ పథకంతో పర్యావరణానికి ముప్పు
లండన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్మార్ట్‌సిటీ’ పథకం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2015లో భారత ప్రభుత్వం ‘స్మార్ట్‌సిటీ’పథకానికి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం
పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లింకోల్న్‌కు చెందిన పరిశో ధకులు ఈ అధ్యయనం చేపట్టారు. స్మార్ట్‌సిటీ పథకంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతంలో ఉన్న మూడు నుంచి ఐదంతస్తుల భవనాల స్థానంలో 40 అంతస్తులకు మించి భవన నిర్మాణాలు చేపడతామని భారత ప్రభుత్వం పేర్కొందని పరిశోధకుల తెలిపారు.