ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆమె తన లేఖలో కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆమె తన లేఖలో కోరారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, బడ్జెట్ లోటు భర్తీ చేయడం, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం వంటి హామీలను అమలు చేయాలని సోనియా గాంధీ కోరారు.