సాక్షి, చెన్నై : కోల్‌కతా నుంచి ఒకే ప్రయాణికుడితో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చెన్నై చేరుకుంది. సింగపూర్‌లో చిక్కుకున్న 145 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం సింగపూర్ నుంచి కోల్‌కతా మీదుగా శుక్రవారం రాత్రి చెన్నై చేరుకుంది. ఈ విమాన ప్రయాణికులను స్వాగతించేందుకు ప్రభుత్వ అధికారులు, వైద్య బందం, ఇమిగ్రేషన్, కస్టమ్స్ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. విమానం తలుపులు తెరచుకున్న తరువాత ఒకే ఒక ప్రయాణికుడు కిందికి దిగాడు. అధికారుల విచారణలో సింగపూర్ నుంచి 145 మంది వచ్చామని, కోల్‌కతాలో 144 మంది దిగి వెళ్లారని, తాను మాత్రం చెన్నైకి వచ్చినట్లు తెలిపారు. (చదవండి : వందే భారత్ మిషన్ : ఆ విమానాలకు బ్రేక్?)
దీంతో అధికారులు అతని సాదర స్వాగతం పలికారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. అతన్ని 14 రోజులు పాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు మేలకోట్టైయూరులోని ప్రైవేటు వసతి గదికి పంపారు. దీని గురించి అధికారులు మాట్లాడుతూ విమానంలో వచ్చిన ప్రయాణికులలో 130 మందిని కోల్‌కతాలో దింపి, 15 మంది చెన్నైకు తీసుకొస్తున్నట్లు సమాచారం అందిందని, అయితే 144 మంది కోల్‌కతాలో దిగినట్లు, ఒకరు మాత్రమే ఇక్కడికి వచ్చినట్లు అప్పుడే తెలిసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment