
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
చెన్నై: ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దాంతో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తిరుచ్చి నుంచి దుబాయ్ వెళుతున్న ఎయిరిండియా విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాన్ని చెన్నై ఎయిర్పోర్టులో దించివేశారు. విమానంలో 170మంది ప్రయాణికులు ఉన్నారు. కొద్దిలో ప్రమాదం తప్పటంతో ఎయిరిండియా విమానసిబ్బందితో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.