న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ రంగంలోని పలు కంపెనీల మీద కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధించిన విషయం తెలిసిందే. ఇక కరోనానేపథ్యంలో సాంకేతిక దిగ్గజ కంపెనీలు ఫేస్‌బుక్, గూగుల్ ఈ ఏడాది (2020) మొత్తం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పలు విషయాలను వెల్లడించారు. మొదటగా తమ కంపెనీలోని ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ, వర్క్ ఫ్రం హోం మోడల్‌ను తీసుకురానున్నామని తెలిపారు. (భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు)
అదే విధంగా ఈ సమయంలో ప్రజలకు సమాచారం అందించటంలో సహాయం అందించాలని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. తమ కంపెనీ ద్వారా ఉత్పత్తులు,సేవలను పలు సంస్థలు, ఆఫీసులకు అందించటంపై దృష్టి సారిస్తున్నట్లు పిచాయ్ తెలిపారు. ఇప్పుడు తమ ఉద్యోగులు చేసిన సృజనాత్మక, పరిశోధనాత్మక సర్వేలు, డేటాను తెలుసుకోబోతున్నామని ఆయన చెప్పారు. ఇక సంస్థ అభివృద్ధి విషయంలో సానుకూలంగా ఉంటూ కొత్త ప్రాజెక్టులు, ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన పెర్కొన్నారు. అదే విధంగా గూగుల్ సంస్థ రూపొందించిన ప్రణాళికలు అభివృద్ధిని సాధించటంలో ఉద్యోగులంతా పని ప్రదేశాల్లో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇక ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో ఆపిల్ సంస్థతో కలిసి ఆరోగ్య సంస్థలకు ఉపయోగపడే కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీ రూపొందిచనున్నామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment