ముంబయి : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై డీఐజీ సునీల్ పరాస్కర్పై మోడల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జూన్ 27న మోడల్కు పంపిన ఓ ఈ-మెయిల్లో ఆమెను చెల్లిగా సంబోధించారనే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆరోపణలు చేసిన మోడల్ కూడా దీనిపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, దీంతో వారిద్దరి మధ్య మోడల్ ఆరోపణలు చేస్తున్నటువంటీ సంబంధమేదీ లేదనే విషయం స్ఫష్టం అవుతోందని కోర్టుకు తెలిపారు.
సునీల్ పరాస్కర్ తనను రేప్ చేశారంటూ ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి తాను పరాస్కర్‌ను కలిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉన్న పరాస్కర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గత బుధవారం రాత్రి మలవానీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కాగా మోడల్ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ టీవీ రియాల్టి షోలో పాల్గొనేందుకు వివాదాన్ని సృష్టించడానికి కుట్ర పన్నానంటూ ఆ మోడల్ తనకు స్పష్టం చేసిందని ఆమె మాజీ లాయరైన రిజ్వన్ సిద్దిఖి ఆరోపించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె కేసు పెట్టిందని భావించడంవల్లే తాను ఈ కేసు నుంచి తప్పుకొన్నానని ఆయన తెలపటం విశేషం. లాయర్ వాంగ్మూలాన్ని పోలీసులు మూడు రోజుల క్రితం నమోదు చేశారు. మోడల్‌కి, తనకు మధ్య నడిచిన సంభాషణల తాలుకు సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించాడు. దాంతో మోడల్ కేసు సినిమాలో కంటే ఎక్కువగా రోజుకో మలుపు తిరుగుతోంది.
'చెల్లిలా సంబోధించారు'
Published Thu, Aug 7 2014 10:06 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement