
ఆ డీజీపీ నన్ను రేప్ చేశాడు: ముంబై మోడల్
మహారాష్ట్రలో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అత్యాచారం ఆరోపణలు కలకలం రేపాయి. ముంబై మాజీ అదనపు నగర కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్(57) తనను రేప్ చేశారంటూ ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది.
ముంబై: మహారాష్ట్రలో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అత్యాచారం ఆరోపణలు కలకలం రేపాయి. ముంబై మాజీ అదనపు నగర కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్(57) తనను రేప్ చేశారంటూ ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది. 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి తాను పరాస్కర్‌ను కలిిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉన్న పరాస్కర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి మలవానీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు మంగళవారం ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను కలసి పరాస్కర్‌పై ఫిర్యాదు చేసింది. మరోవైపు పరాస్కర్‌పై ఆరోపణలకు సంబంధించి నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.