వివరణ ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్కు నోటీసులు | Supreme court asks CBI director to file response in 10 days | Sakshi

వివరణ ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్కు నోటీసులు

Published Tue, Sep 9 2014 1:27 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

వివరణ ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్కు నోటీసులు - Sakshi

వివరణ ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్కు నోటీసులు

2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురితో భేటీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ : 2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురితో భేటీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.  ఆయనను సీబీఐ డైరెక్టర్గా తొలగించాలని దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది.  2జీ కుంభకోణంలో నిందితులను రక్షిస్తున్నారన్న ఆరోపణలతో పాటు, విజిటర్స్ సాక్ష్యాలను పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టు ముందుంచారు. ఇందుకు సంబంధించి పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రంజిత్ సిన్హాను ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement