న్యూఢిల్లీ: మహాత్మాగాంధీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. జాతిపితగా ప్రజలు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారని, లాంఛనప్రాయమైన గుర్తింపులకి ఆయన అతీతుడని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం..గాంధీజీని భారతరత్న పురస్కారంతో గౌరవించాలని అనిల్ దత్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment