సాక్షి, న్యూడిల్లీ : భారతరత్నను మించిన మహోన్నత వ్యక్తి మహత్మా గాంధీ అని అత్యున్నత భారత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.మహాత్మా గాంధీకి భారతరత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న అభ్యర్థనను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో కేంద్రానికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రజలు గాంధీని మహోన్నత స్థాయిలో గుర్తించి.. జాతి పితగా నిలిపారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అర్వింద్ బాబ్డే పేర్కొన్నారు. గాంధీ మహోన్నతమైన వ్మక్తి అని, ఆయనకు ఉన్న గుర్తింపు గొప్పదని కోర్టు తెలిపింది.
దేశంలో భారతరత్న అవార్డు అత్యున్నతమైనదని తెలిసిందే. అయితే భారత రత్న బిరుదు కంటే గాంధీజీకి ఉన్న గుర్తింపు మహోన్నతమైనదని కోర్టు వెల్లడించింది. గతంలో సైతం ఈ అంశంపై కోర్టులో అనేకమార్లు పిల్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. గాందీకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయన్ను, ఆయన సేవలను తక్కువ చేసి చూసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment